Home  »  TV News  »  ఆవిడ డాన్స్ అలా ఉంటది మరి!

Updated : Oct 31, 2022

ప్రతీ వారం లానే ఈ వారం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో ఎంతో అలరించింది. ఈ వారం ‘బంగారం ఒకటి చెప్పనా’ అనే కాన్సెప్ట్ తో ఈ ఎపిసోడ్ నడిచింది. ఇక  ఈ ఎపిసోడ్ లో "దేవత" సీరియల్ జోడి సుహాసిని, అర్జున్ అంబటి  స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ వారం షోలో  స్టేజిపై కమెడియన్ హైపర్ ఆది హంగామా మామూలుగా లేదు. అన్నపూర్ణమ్మతో రష్మీ డాన్స్ చేయించింది. "నాయనమ్మ గారి డాన్స్ మీద మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పటికైనా కలవాలనుందా ఆవిడతో" అని ఆది అడిగేసరికి "ఆవిడ డాన్స్ చూసాక ఎవరికైనా ఆవిడని కలవాలని అనిపిస్తుందా చెప్పు" అని కౌంటర్ వేశారు కృష్ణ భగవాన్. 

తర్వాత ఆది ముగ్గురమ్మాయిలతో కలిసి ‘ఊ అంటావా మావ’ పాటకు అల్లు అర్జున్, సమంత వేసిన ఫ్లోర్ స్టెప్ చేయడానికి ట్రై చేశాడు. కానీ.. ఇద్దరమ్మాయిలతో ప్రయత్నించినా స్టెప్ వేయడంలో ఫెయిలయ్యాడు. ఆ తర్వాత ఉట్టి కొట్టే ప్రోగ్రాం ఫుల్ ఎంటర్టైన్ చేసింది.  

ఆ తర్వాత  కృష్ణ భగవాన్, ఆది అంతా కలిసి రిక్షా స్కిట్ వేశారు. అందులో పంచ్ ప్రసాద్ వేసిన డైలాగ్స్ మీద కృష్ణ భగవాన్ స్పందించారు. "ఎవరికీ సంబంధం లేని జోకులు వేస్తాడు, ఇక్కడే నవ్వే జోకులేస్తాడు.. ఎవరికీ అర్థం కానీ జోకులేస్తాడు.. మనకే అర్థమయ్యే జోకులేస్తాడు." అంటూ ప్రసాద్  కామెడీ మీద కౌంటర్ వేశారు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.